శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట నుంచి వెంకటాపురం వెళ్లే రోడ్డు గుంతలతో అత్యంత అధ్వానంగా తయారైందని ఓబీసీ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు వెంకటాద్రి యాదవ్ అన్నారు. గుంతలను పూడ్చాలని రేణిగుంట ఎంపీడీవో విష్ణు చిరంజీవికి శనివారం వినతిపత్రం అందజేశారు. ఎంపీడీవోను ఆయన కార్యాలయంలో కలిసి సమస్య వివరించారు. రాళ్లు తేలిన రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. శాశ్వత మరమ్మతులు చేయించాలని కోరారు.