శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలోని అంజి గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా శుక్రవారం కన్య మూల గణపతికి శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. కలశ స్థాపన చేసి సంకటహర చతుర్థి హోమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈవో విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.