ఏర్పేడు సీఐ జయచంద్ర వార్నింగ్

80చూసినవారు
ఏర్పేడు సీఐ జయచంద్ర వార్నింగ్
మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుశిక్ష తప్పదని ఏర్పేడు సీఐ జయచంద్ర హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 7 మందితో పాటు వారి తల్లిదండ్రులకు శనివారం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు పోలీస్ స్టేషన్ ఎదుట కౌన్సెలింగ్ ఇచ్చారు. సీఐ జయచంద్ర మాట్లాడుతూ మద్యం మత్తులో ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్