రేణిగుంటలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ఘన స్వాగతం

53చూసినవారు
రేణిగుంటలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ఘన స్వాగతం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవకు శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట విమానాశ్రయంలో మంగళవారం ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో ఆయనకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కలంకారి పట్టు వస్త్రంతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం శేషవస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వాగతం పలికిన వారిలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్