శ్రీకాళహస్తిలోని శుక బ్రహ్మశ్రమంలో మంగళవారం రథసప్తమిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, పెద్దలు కలిసి సామూహికంగా సూర్యనమస్కారాలు చేశారు. యోగా గురువు మార్కండేయులు మాట్లాడుతూ.. సూర్యనమస్కారాలతో ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను ఓ భాగంగా మార్చుకోవాలని సూచించారు. కనీసం రోజులో ఓ గంట యోగాసనాలకు కేటాయించాలన్నారు.