శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా స్వామి, అమ్మవార్లు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ముందుగా స్వామి, అమ్మవార్లను ఆలయంలోని అలంకారం మండపంలో వివిధ పుష్పాలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సూర్యప్రభ వాహనంపై శ్రీకాళహస్తీశ్వరుడు, చప్పరం వాహనంపై జ్ఞాన ప్రసూనాంబ అమ్మవార్లను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించి హారతులు సమర్పించారు.