రాత్రిపూట అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి హెచ్చరించారు. శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రానున్న ముక్కంటి బ్రహ్మోత్సవాల్లో పటిష్ఠ బందోబస్త్ ఏర్పాటు చేస్తామన్నారు. దొంగతనాలు అరికట్టడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ప్రజలు తమకు సహకరించాలని కోరారు.