శ్రీకాళహస్తి ఐసీడీఎస్ కార్యాలయంలో శుక్రవారం అంగన్వాడీ టీచర్లకు, వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలకు కిషోర్ వికాసంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థాయిలో బాలికల చదువు, సంపూర్ణ ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి వంటి విషయాలపై అవగాహన కల్పించి అభివృద్ధి చెందేలా చేయడానికి కిశోర్ వికాస్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీడీపీఓ శాంతి దుర్గ తెలిపారు.