శ్రీకాళహస్తి ఆర్పీబీరస్ బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో వరదయ్యపాలెం పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. 9వ తరగతి విద్యార్థులు రితీష్, వరుణ్ రెడ్డి ప్రదర్శించిన స్మార్ట్ బ్లైండ్ మ్యాన్ వాకింగ్ స్టిక్ అనే ఎగ్జిబిట్స్ ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఈనెల 6వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి ప్రదర్శనలో పాల్గొననున్నారు.