టమాటాలు మార్కెట్కు తరలిస్తున్న వాహనం బోల్తా పడి యువకుడు తీవ్రంగా గాయపడినట్లు మొలకలచెరువు ఎస్ఐ గాయత్రి తెలిపారు. సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం, ఊర్వాయికి చెందిన రైతు ఎల్లప్ప పండించిన టమోటాలను కుమారుడు దామోదర్ (17) టాటా ఏస్ వాహనంలో శుక్రవారం మొలకలచెరువు తరలిస్తున్నాడు. మార్గమధ్యంలోని ములకలచెరువు ఏటి వద్ద టాటా ఏస్ బోల్తా పడింది. తీవ్రంగా గాయపడ్డ దామోదర్ ను మదనపల్లికి తరలించి వైద్యం అందించారు.