చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం తిరుపతిలో జరిగింది. రుయాలో ఓపీ తీసుకున్న బాసెట్టి వెంకటేశ్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉలుకుపలుకు లేకుండా పడిపోయారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా ఏర్పేడు వికృతమాల మర్రిమందకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని వివరాలు తెలిసిన వాళ్లు తిరుపతి వెస్ట్ పోలీసులను సంప్రదించాలని కోరారు.