బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తిరుమల శ్రీవారి దర్శనార్థం గురువారం సాయంత్రం తిరుపతికి విచ్చేసారు. అలిపిరి వద్ద ఆయనకు ఘన స్వాగతం లభించింది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు జల్లి మధుసూదన్, సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ లు స్వాగతం పలికి ఆయనను సత్కరించారు.