మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన ఇంట్లో శుక్రవారం ఇరుముడి కట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆయనతో పాటు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, పలువురు స్వాములు ఇరుముడులు కట్టారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో కలిసి శబరిమల యాత్రకు బయల్దేరారు.