బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని ఖండిస్తూ తిరుపతి నగరంలో శుక్రవారం శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. తక్షణమే హిందువులను కాపాడాలంటూ తుడా మైదానం నుంచి గాంధీ రోడ్డు పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం వరకు చేపట్టిన ర్యాలీకి ముఖ్య అతిథిగా రాధా మనోహర్ దాస్ స్వామి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉపాధ్యాయ సమితి అధ్యక్షులు డేగల మహేష్, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు కిరణ్ కుమార్ లు పాల్గొన్నారు.