రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ అథారిటీ మెంబర్, వైసీపీ నాయకులు సునీల్ చక్రవర్తి శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. ఎన్జీఓ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో వైసీపీ నాయకులు జనసేనలో చేరారు. సునీల్ చక్రవర్తి కి పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆహ్వానించారు. అలాగే వైసిపి నాయకుడు వజీర్ బాషా కూడా జనసేనలో చేరారు. తిరుపతిలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తామని వారు చెప్పారు.