తిరుపతి: ఎస్వీయూ రీవాల్యుయేషన్ ఫలితాలను వెంటనే ఇవ్వాలి

57చూసినవారు
తిరుపతి: ఎస్వీయూ రీవాల్యుయేషన్ ఫలితాలను వెంటనే ఇవ్వాలి
తిరుపతిలోని ఎస్వీయూ పరిధిలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన వెంటనే రీవాల్యుయేషన్ కి అప్లై చేసిన విద్యార్థులకు ఆ ఫలితాలను ఒక నెల లోపు విడుదల చేసేటట్లు ప్రక్షాళన చేయాలని గిరిజన నవ సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు పాలిత్య శివశంకర్ నాయక్ డిమాండ్ చేశారు. శనివారం వర్సిటీ విసి అప్పారావుకు వర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ సెమిస్టర్ రీవాల్యుయేషన్ పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేయాలని వినతి పత్రం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్