టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఆదివారం వేకువజామున కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శనివారం రాత్రి ఆయన తిరుమలకు చేరుకోగా, అధికారులు బస ఏర్పాట్లు చేశారు. గంభీర్ సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా గంభీర్‌ను చూసేందుకు ఆలయ ప్రాంగణంలో భారీ సంఖ్యలో అభిమానులు భారీగా చేరారు.