తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని వినాయకుడి ఆలయ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను108 అంబులెన్స్ ద్వారా తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.