రథ సప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో చేసిన ఏర్పాట్లను సోమవారం సాయంత్రం టీటీడీ ఈవో జె. శ్యామలరావు, అదనపు ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించారు. గ్యాలరీల్లో అన్న ప్రసాదం పంపిణీ, తాగునీరు, మరుగుదొడ్లు, షెడ్లు వంటి సౌకర్యాలను తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు, విజిలెన్స్ సమన్వయంతో మాడ వీధుల్లో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.