తిరుమలలో తీర్థాలు, ఉప ఆలయాల నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై టీటీడీ ఈవో జె. శ్యామలరావు అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని ఆకాశగంగ, పాప వినాశనం, చక్రతీర్థంలలో పార్కింగ్, లైటింగ్, క్యూలైన్లు, సూచిక బోర్డులు, ఉప ఆలయాలలో ప్రసాద దిట్టం, పలు నిర్మాణ పనులు తదితర అభివృద్ధి కార్యక్రమాల చర్చించారు.