తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల కీర్తనల్లో ఉపనిషత్తులు, పురాణాల సారాన్ని సహజ కవితా దృష్టితో చెప్పారని వివరించారు. తిరుపతిలో శనివారం సాయంత్రం అన్నమయ్య 617వ జయంతి సందర్భంగా జరిగిన సాహితీ సదస్సులో, ఆయన ఉపనిషత్తులు, పురాణాల సారాన్ని శ్రీ వేంకటేశ్వరుని మీద అన్వయించి, భక్తులకు కవితారూపంలో అందించారని తెలిపారు.