ఈ నెల 10 నుండి 14 వ తేదీ వరకు ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో జరగనున్న మునిసిపల్ గవర్నెన్స్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ కొరకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య ఆదివారం వెళ్ళారు. ఈ ఐదు రోజుల పాటు కార్యాలయ కార్యక్రమాలకు అంతరాయం లేకుండా అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి కి ఇన్ చార్జీ బాధ్యతలను అప్పగించారు.