తిరుపతి: మాజీ ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న కార్పొరేటర్లు

55చూసినవారు
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం మంగళవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు ఓటేసిన కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన ఇంటికి వెళ్లారు. మాకు బతకాలని లేదు. మిమ్మల్ని వాళ్లు చాలా ఇబ్బందులు పెట్టారు. అది చూడలేకపోయాము. అందుకే టీడీపీకి ఓట్లు వేశాం అంటూ భూమన కాళ్లు పట్టుకున్నారు. ఆయనను పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్