రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య పిలుపునిచ్చారు. 3వ శనివారం స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీట్ ధ హీట్ నినాదంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎండ తీవ్రతలను తగ్గించేలా మొక్కలు నాటడం, చలివేంద్రాలు ఏర్పాటు, పారిశుద్ధ్య కార్మికులకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, టోపీలను అందజేశారు.