తిరుపతి: తెప్పపై ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారి విహారం

72చూసినవారు
తిరుపతి: తెప్పపై ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారి విహారం
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు ఆదివారం సాయంత్రం ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఇందులో భాగంగా ఉదయం ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్స‌వ‌ర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.

సంబంధిత పోస్ట్