తిరుపతి: రామకృష్ణతీర్థ ముక్కోటి ఏర్పాట్లపై సమీక్ష

82చూసినవారు
తిరుపతి: రామకృష్ణతీర్థ ముక్కోటి ఏర్పాట్లపై సమీక్ష
తిరుమలలో ఈనెల 12న జరగనున్న శ్రీరామకృష్ణతీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్యచౌదరి శుక్రవారం గోకులం సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. తిరుమలలో జరిగే అతిముఖ్యమైన తీర్థ ఉత్సవాల్లో ఒకటైన రామకృష్ణతీర్థ ముక్కోటికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. యాత్రికుల కోసం రేడియో బ్రాడ్ కాస్టింగ్ ద్వారా ప్రకటనలు, డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్