తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 6 నుండి 12వ తేదీ వరకు జరుగనున్న శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాల సందర్భంగా ఆదివారం శ్రీగోవిందరాజస్వామివారు రామచంద్రకట్ట పైకి వేంచేపు చేశారు. ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్వామివారు ముందుగా ఊరేగింపుగా వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది.