తిరుపతి: తెప్పపై శ్రీ పార్థసారథిస్వామివారి కటాక్షం

80చూసినవారు
తిరుపతి: తెప్పపై శ్రీ పార్థసారథిస్వామివారి కటాక్షం
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం సాయంత్రం శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీపార్థసారథిస్వామివారు భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై ఐదు చుట్లు విహరించి భక్తులకు అభయమిచ్చారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.

సంబంధిత పోస్ట్