తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 6 నుండి 12వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరుగనున్నాయిని టీటీడి బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏడు రోజుల పాటు సాయంత్రం 6. 30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారి పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తారని, ఆ తరువాత ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారని ఆ ప్రకటనలో తెలిపారు.