శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల వాహన సేవల బుక్ లెట్ ను టీటీడీ ఈవో జె. శ్యామలరావు శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. తిరుమలలోని ఈవో క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఫిబ్రవరి 13వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుందన్నారు. ఫిబ్రవరి 17న అంకురార్పణ నిర్వహిస్తారని చెప్పారు.