శ్రీవాణి ట్రస్ట్ ప్రస్తుత నిబంధనలను మరింత సులభతరమైన, పారదర్శకమైన ప్రజాసంబంధమైన రూపంలో పునఃపరిశీలించాలని టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె. శ్యామలరావు అధికారులకు నిర్దేశించారు. శనివారం టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఈవో మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఆలయాలు ప్రాథమిక పాత్ర పోషిస్తాయని వివరించారు.