తిరుపతి పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అన్నమయ్య కూడలి వద్ద నిర్మిస్తున్న తుడ టవర్స్ నిర్మాణ పనులను శనివారం తుడా ఉపాధ్యక్షులు ఎన్. మౌర్య అధికారులతో కలసి పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో టవర్స్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు వివరించారు. తుడ టవర్స్ నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయని, నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని అన్నారు.