రిపేర్ల కారణంగా విల్లుపురం–తిరుపతి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు పాక్షికంగా రద్దయ్యాయినట్లు రైల్వే అధికారులు గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. విల్లుపురం నుంచి ఉదయం 5. 40కి బయల్దేరే రైలు కాట్పాడి వరకే నడుస్తుంది. తిరుపతి నుంచి వెళ్లే రైలు కాట్పాడి నుంచి మొదలవుతుందని, జూన్ 3, 18, 20, 21, 22, 25, 27, 28, 29 తేదీలు, జూలై 1, 3 తేదీల్లో కాట్పాడి–తిరుపతి మార్గంలో ఈ రైలు నడవదని వారు తెలిపారు.