మామిడి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, తగిన గిట్టు బాటు ధరలు కల్పించేలా కృషి చేయాలని సంబంధిత అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మామిడి ఫ్యాక్టరీ యాజమానులు, రైతు సంఘ నాయకులు, వ్యాపారస్తులుతో కలిసి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.