తిరుపతిలో ఇరువురు దారిదోపిడి దొంగలను తిరుపతి పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. వారి నుంచి 24 గ్రాముల బంగారపు చైను, దోపిడీకి పాల్పడిన 2 ఆటోలు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 12న అలిపిరి- చెర్లోపల్లి మార్గంలోని సైన్స్ సెంటర్ సమీపంలో దారిదోపిడి జరిగిన విషయం తెలిసిందే. పలమనేరు మండలం జంగాలపల్లికి చెందిన శివాజీ, కిరణ్ తిరుపతిలో ఉంటూ దొంగతనాలకు పాల్పడినట్లు నిర్ధారించారు.