తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలోని వేద విద్యార్థులు శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. పవిత్ర ధనుర్మాసంలో తమ పీఠంలో విద్యార్థులు ధనుర్మస వ్రతం ఆచరించిన సందర్బంగా అదనపు ఈవో సిహెచ్ వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అంతకు ముందు వేద విజ్ఞానపీఠం ప్రధానోపాధ్యాయులు అవధాని ఆధ్వర్యంలో విద్యార్థులు తమ అధ్యాపకులతో కలిసి శ్రీవారి ఆలయ ప్రదక్షిణగా నాలుగు మాడ వీధుల్లో శ్రీవిష్ణుసహస్ర నామ పారాయణ గోష్టి చేశారు.