రేణిగుంట: బస్సు ఢీకొని గోవు మృతి

71చూసినవారు
రేణిగుంట: బస్సు ఢీకొని గోవు మృతి
బస్సు ఢీకొని నిండు గర్భంతో ఉన్న గోవు మృతి చెందిన ఘటన రేణిగుంట మండలం కొత్తపాలెం సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి ముసిలిపేడు, శ్రీకాళహస్తి వైపు వెళ్తున్న బస్సు కొత్తపాలెం సమీపంలో గోవును ఢీకొనడంతో గోవు అక్కడికక్కడే మృతి చెందింది. ఆవును కోల్పోయిన మహిళా రైతు ఆవు ఎదుట కూర్చొని లబోదిబో మంటూ గుండెల్లో పగిలేలా రోధించడం చూపర్లకు కండతడి పెట్టించింది.

సంబంధిత పోస్ట్