వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ డిగ్రీ కళాశాలలో ఉచిత కంప్యూటర్ సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ విజయ శేఖరం మంగళవారం తెలిపారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ. ఈ కోర్సు ఈ నెల 4వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ వరకు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎక్స్ ఎల్లలో ఉచితంగా శిక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. కంప్యూటర్ పై అవగాహనను పెంపొందించేందుకు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు.