బాలాయపల్లి మండల నూతన ఎంపీడీవోగా కె. శ్రీనివాసులు శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో డిప్యూటీ ఎంపీడీవోగా సేవలందిస్తున్న ఆయన, ప్రమోషన్ పై బదిలీ ద్వారా బాలాయపల్లి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీనివాసులు మండలంలోని సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తాను. ప్రజలకు అందుబాటులో ఉండి, అభివృద్ధి పనుల అమలుకు ప్రాధాన్యత ఇస్తాను అని తెలిపారు.