బద్వేలు నియోజకవర్గంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రోజురోజుకూ చలి ప్రభావం పెరుగుతుండడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఉదయాన్నే ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు మంచు కూడా తీవ్రంగా కురుస్తుంది. గ్రామ పరిచారాలన్నీ దట్టమైన పొగ మంచుతో కనిపిస్తున్నాయి. సోమవారం తెల్లవారినా వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణాలు సాగిస్తున్నారు.