చంద్రగిరి పట్టణం పాతపేటకు చెందిన జయంత్ శర్మ ఐదుగురు స్నేహితులతో కలిసి డోర్నకంబాల గ్రామానికి సమీపంలోని వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి మంగళవారం వెళ్లాడు. ఈత సక్రమంగా రాని జయంత్ బావిలో మునిగిపోయాడు. అతని స్నేహితులు బావిలో గాలించి బయటికి తీశారు. చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జయంతి శర్మ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు.