మంత్రిని కలిసిన చంద్రగిరి ఎమ్మెల్యే

76చూసినవారు
మంత్రిని కలిసిన చంద్రగిరి ఎమ్మెల్యే
తిరుపతి కలెక్టరేట్‌లో జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, కలెక్టర్ వెంకటేశ్వర్‌ను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని మామిడి రైతుల సమస్యలు వారికి వివరించారు. గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరగా, మంత్రి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్