చంద్రగిరి: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: డిఎస్పీ ప్రసాద్, సీఐ

81చూసినవారు
చంద్రగిరి: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: డిఎస్పీ ప్రసాద్, సీఐ
యోగా సాధన చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చంద్రగిరి డిఎస్పీ ప్రసాద్, తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం తిరుచానూరు పోలీస్ స్టేషన్ నుండి సింధు జంక్షన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతిఒక్కరూ యోగాను దినచర్యలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. పోలీస్ సిబ్బంది కూడా తమ ఒత్తిళ్ల నివారణకు యోగాను సాధన చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్