బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని అనుపల్లి మోడల్ స్కూల్ హెచ్ఎం దుర్గాప్రసాద్ కోరారు. ఆదివారం రామచంద్రాపురం మండలంలోని బొప్పరాజుపల్లిలో విద్యార్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇక్కడ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఉచిత కిట్లు, బూట్లు, యూనిఫారం, నోట్‌బుక్స్, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలలో లభిస్తున్నాయని చెప్పారు.