చంద్రగిరి: అనుపల్లెలో వైభవంగా గంగ జాతర

63చూసినవారు
చంద్రగిరి: అనుపల్లెలో వైభవంగా గంగ జాతర
రామచంద్రాపురం మండలంలోని అనుపల్లె గ్రామంలో గంగ జాతర వైభవంగా జరిగింది. బుధవారం ఉదయం వేకువజామున గంగమ్మ అమ్మవారి ఊరేగింపు జరిగింది. అనుపల్లి గ్రామంలో 25 సంవత్సరాల తర్వాత గంగ జాతరను నిర్వహించారు. మంగళవారం రాత్రి చల్లకుండా, దున్నపోతును ఊరేగింపు చేశారు. అనంతరం బంక మట్టితో గంగమ్మ తల్లి ప్రతిమను ప్రతిష్ట చేశారు. బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పాలతో విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్