తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై మాడ వీధుల్లో విహరించి భక్తులను కనువిందు చేశారు. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అమ్మవారికి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ఉద్యానవనంలో ఉత్సవర్లకు విశేష అభిషేకం, సాయంత్రం సుందరంగా అలంకరించి బంగారు తిరుచ్చిపై ఊరేగించారు. భక్తులు భారీగా పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు.