చంద్రగిరి: మూడవ రోజు తెప్పపై విహరించిన శ్రీ పద్మావతీ అమ్మవారు

78చూసినవారు
చంద్రగిరి: మూడవ రోజు తెప్పపై విహరించిన శ్రీ పద్మావతీ అమ్మవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భాగంగా మూడవరోజు సోమవారం పద్మసరోవరంలో శ్రీ పద్మావతీ అమ్మవారు తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. సాయంత్రం పద్మపుష్కరిణిలో తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.

సంబంధిత పోస్ట్