చంద్రగిరి: నూతన డిప్యూటీ ఈవోగా హరినాథ్ బాధ్యతలు స్వీకరణ

84చూసినవారు
చంద్రగిరి: నూతన డిప్యూటీ ఈవోగా హరినాథ్ బాధ్యతలు స్వీకరణ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి నూతన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)గా హరినాథ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హరినాథ్ గతంలో తిరుమలలోని శ్రీవారి ఆలయంలో డిప్యూటీ ఈవోగా కీలక పదవిని నిర్వర్తించి, పరిపాలనా సామర్థ్యం ప్రదర్శించిన అనుభవం ఉన్నవారు. తిరుచానూరు ఆలయంలో తాను తన సేవలను సమర్థవంతంగా అందిస్తానని, భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని హరినాథ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్