చంద్రగిరి: నేడు దామలచెరువులో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన

52చూసినవారు
చంద్రగిరి: నేడు దామలచెరువులో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన
తిరుపతి జిల్లా పాకాల మండలంలో శనివారం రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పర్యటించనున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే తెలిపారు. ఉదయం 11 గంటలకు దామలచెరువు వద్ద మామిడి రైతులు, వ్యాపారులతో మంత్రి సమావేశమవుతారు. మామిడి ధరలు, మార్కెట్ పరిస్థితులపై సమీక్షించి, రైతుల సమస్యలు, విక్రయాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా మంత్రికి స్వాగతం పలికేందుకు కూటమి నాయకులు, కార్యకర్తలు నేండ్రగుంటలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్