చంద్రగిరి మండలం ఐతేపల్లి - ఎ. రంగంపేట రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే పులివర్తి నాని మంగళవారం పరిశీలించారు. ఐతేపల్లి మెయిన్ రోడ్ నుండి పులిత్తివారిపల్లి వరకు స్వయంగా వెళ్లి రోడ్డు పనులను ఎమ్మెల్యే నాని పరిశీలించారు. రోడ్డు విస్తరణలో నష్ట పోతున్న బాధితులు వారి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. 30సంవత్సరాల తర్వాత రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నామని ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే తెలిపారు.